Sports

Sachin Taran cricketer who got promotion as a father for the second time Emotional as Mahalakshmi was born

Jacques Kallis is a name that needs no special introduction to cricket fans. This star cricketer from Sachin's generation gave the South African team undisputed victories with his all-round performance. Without getting involved in any controversies, he just loved cricket and became known as a legendary player. He also won the hearts of Indian fans with his playing style and behavior.

 After retiring as a cricketer, he gave valuable advice and suggestions to young cricketers as a coach. Kalis, who has made a name for himself in international cricket as a player and a coach, recently shared a good news. He shared the good news on social media that he became a father for the second time. The legendary all-rounder said that his wife Pandanti gave birth to a baby girl and both the wife and the child are safe. Kalis couple already have a son.

Kalis also has a good association with IPL. He played for Royal Challengers Bangalore in IPL from 2008 to 2010. He then represented Kolkata Knight Riders for three years. Kalis was also a member of the Kolkata team that won the IPL title in 2012 and 2014. Kalis played a total of 98 matches in the Dhanadhan League and scored 2,427 runs at an average of 28.55. The strike rate is 109.23. Among them 17 fifties.. The highest individual score is 89 runs. He also took 65 wickets in bowling.

Telugu version

జాక్వెస్ కలిస్.. క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. సచిన్‌ తరం నాటి కాలానికి చెందిన ఈ స్టార్‌ క్రికెటర్‌ తన ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో దక్షిణాఫ్రికా జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా కేవలం క్రికెట్‌నే ప్రేమించి దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన ఆటతీరు, ప్రవర్తనతో భారతీయ అభిమానుల మనసులు కూడా గెల్చుకున్నాడు.

 క్రికెటర్‌గా రిటైరయ్యాక కోచ్‌గా యువ క్రికెటర్లకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఇలా ఆటగాడిగా, కోచ్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కలిస్‌ తాజాగా ఓ శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి అయినట్లు సోషల్‌ మీడియా వేదికగా గుడ్‌ న్యూస్‌ షేర్‌ చేశాడు. తన భార్య పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని, భార్యా, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు ఈ దిగ్గజ ఆల్‌రౌండర్‌ తెలిపాడు. కాగా కలిస్‌ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు.

కాగా కలిస్‌ ఐపీఎల్‌తోనూ మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 2008 నుంచి 2010 వరకు ఆడాడు. ఆ తర్వాత మూడేళ్లపాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్‌కతా జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు కలిస్‌. ధనాధన్‌ లీగ్‌లో మొత్తం 98 మ్యాచులు ఆడిన కలిస్ 28.55 సగటుతో 2,427 రన్స్‌ చేశాడు. స్ట్రైక్ రేట్ 109.23 కావడం విశేషం. ఇందులో 17 అర్ధ సెంచరీలు ఉండగా.. అత్యధిక వ్యక్తిగత స్కోరు 89 పరుగులు. బౌలింగ్‌లోనూ 65 వికెట్లు తీసుకున్నాడు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens