విష్ణు షేర్ చేసిన 'కన్నప్ప' మేకింగ్ వీడియో

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఎపిక్ మూవీ 'కన్నప్ప' ఈ వేసవిలో ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న వేళ, కన్నప్ప టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

తాజాగా, మంచు విష్ణు కన్నప్ప మేకింగ్ వీడియో పంచుకున్నారు. ఈ వీడియోలో, ఈ సినిమా కోసం ఎంత అధ్యయనం చేశామో, ఎన్ని డిస్కషన్లు జరిపామో, ఎంత కష్టపడి పనిచేశామో విష్ణు వివరించారు. దర్శకుడితో కలిసి 24 క్రాఫ్ట్స్‌తో సమన్వయం చేసుకుని ముందుకు సాగడమెలా జరిగిందో ఈ వీడియోలో ఆయన వెల్లడించారు.

కన్నప్ప చిత్రం ఆవా ఎంటర్టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens