ఎందరో ఆడవాళ్ళ లాంటి కథనే ఈ కథ అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అద్భుతాలు అవి ఎప్పుడైన జరగవచ్చు వాటిని మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి - Smt. TIYYAGURA DEVI PRIYA | Nari Shakti - Empowering Women | Mana Voice

ఎందరో ఆడవాళ్ళ లాంటి కథనే ఈ కథ అనిపిస్తుంది కానీ ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అద్భుతాలు అవి ఎప్పుడైన జరగవచ్చు వాటిని  మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి...

ఆమె పేరు దేవి రెడ్డి,దేవిగారు చిన్నతనంలో ఆటలు, పాటలు,చదువులో చాలా చలాకీగా ఉండేవారు..

అలా ఆడుతూ పాడుతూ చదువుకుంటున్న సమయంలోనే కొన్ని అనుకొని పరిస్థితులలో పెళ్లి జరిగింది.ఇక తర్వాత ఏముంది సంసారం అనే చదరంగంలో సంసార నావ ఈదుతూ ముందుకు సాగుతున్న సమయంలో.

బాబు పుట్టాడు,స్కూలు వయసుకి వచ్చి వెళ్ళటం  మొదలుపెట్టాడు..  అప్పుడు దేవిగారికి  తన గురించి తాను ఆలోచించుకుని వెనక తిరిగి చూసుకుంటే తన గురించి ఏమి లేదు అని తెలుసుకున్నారు,తనకంటూ ఒక గుర్తింపు ఏంటి?  ఫైనాన్షియల్ గా నా కాళ్లపై నేను ఎలా నిలబడాలి అనే భావనకు వచ్చారు,నాకంటూ అందరిలో ఒక గుర్తింపు ఎలా రావాలి ? ఇండిపెండెంట్గా ఎలా ముందుకు సాగాలి అని తనలో తానే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు.

అలా ప్రశ్నించుకుంటూ లేదు  నా కాళ్లపై నేను నిలబడి అందరిలో ఓ గుర్తింపు తెచ్చుకోవాలి అని ఒక దృఢనిచ్చాయానికి వచ్చారు..

ముందు నేను ఏమి చేయాలి నాలో ఉన్న ప్రతిభని ఎలా బయటకి  తీసుకురావాలి అని ఆలోచిస్తూ  బాబు తో పాటు కూర్చుని బాబు బుక్స్ చదువుతూ బాబుకి ఇచ్చిన హోంవర్క్స్ లే    చేస్తూ తనకి వచ్చిన ఇంగ్లీష్ ని మర్చిపోకుండా ఇంకా తనకి తెలియని ఇంగ్లీష్  నేర్చుకోవటం మొదలుపెట్టారు.

అప్పుడే ఏదైనా సాధించాలి అనే ఆలోచన మొదలైంది..కానీ వారిది  అర్థాక్స్ ఫ్యామిలీ అవ్వటం వలన బయటికి వెళ్లి చేసే ఏదైనా చెయ్యాలి అంటే జరగదు,ఏమి చేసినా ఇంట్లో ఉండే చేయాలి అప్పుడు ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న టైం లో  దొరికిన ఒకే ఒక ఆయుధం ఫోన్.

దేవిగారికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం అంటే చాలా ఇష్టం. ముందుగా దాని పై దృష్టి పెట్టి ఫోన్లో  తెలియన ఎన్నో విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలాగే  తెలియని విషయాలను స్నేహితుల ద్వారా తెలుసుకోవడం మొదలుపెట్టారు,అప్పుడే అలాంటి సమయంలోనే  ఫ్రెండ్స్ ద్వారా వెల్నెస్ సెంటర్లో అవకాశం దొరికింది.

వెల్నెస్ సెంటర్లో జాయిన్ అయ్యారు.  అసలు హెల్త్ గురించి కానీ సోషల్ మీడియాని ఎలా ఎక్స్పోజ్ అవ్వాలి నెట్వర్క్ ఎలా పెంచుకోవాలి అని దేవి గారి మెంటర్స్ అయిన ప్రత్యూష గారి దగ్గర చాలా బాగా నేర్చుకున్నారు. ఈరోజు దేవిగారికి వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారంటే దానికి కారణం అదే... ఇలా
సాగుతున్న సమయంలోనే అనుకోకుండా గ్రూప్ కొలాప్స్  అయింది. ఏమి చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో స్వతహాగా హెల్త్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నతంతో కొన్ని న్యూట్రిషన్ కోర్సులు చేశారు..

న్యూట్రిషన్ కోర్సులో జాయిన్ అయిన తరువాత మేడమ్ గారికి అర్దం అయింది ఒకటే మానవ జీవిత మనగడకు ఆహారం ప్రధానం అని ..ఎది అయినా  మనం తీసుకున్న ఆహారంతోనే సాధ్యం అని ..అందుకే ఫుడ్ గురించి కోర్సులు చేసి  జర్నీ స్టార్ట్ చేశారు...స్టార్ట్ చేసిన తరువాత వెనుకకి తిరిగి చూసుకునే పనిలేకుండానే  పయనం ముందుకు సాగింది..

ఒకరు తో స్టార్ట్ అయిన  జర్నీ , ఇద్దరూ, 10 , 50, 100, 500  అంటూ ముందుకు వెళ్తూ ఇప్పుడు 1000+  క్లైంట్ తో  సాగుతుంది.

ఇది  ఒక రోజులోనే సాధ్యం కాలేదు  ఎంతో శ్రమ,కృషి ,పట్టుదల చేసి ఇక్కడి వరకు వచ్చారు,ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు...

దేవిగారు నమ్మే సిద్ధాంతం ఒకటే .. మనం తినే ఆహారం లో చాలా ఉంటాయి, మంచి ఆహారం అనేది ఎంత బాగా హెల్ప్ అవుతుంది అనే దానికి తన క్లైంట్స్ కి వచ్చే రిజల్ట్ ఒక ఉదాహరణ....

మనం మంచి ఆహారం తీసుకుంటే ఎటువంటి సప్లిమెంట్స్ కానీ పౌడర్లు కానీ వాడకుండానే బరువు తగ్గొచ్చు అని చెప్పారు చేసి చూపించారు క్లైంట్స్ నిరూపించారు.

తన దగ్గర జాయిన్ అయినా  క్లైంట్స్ ఎంతోమంది వెయిట్ లాస్ అయ్యారు, Inchloss అయ్యారు, థైరాయిడ్ నార్మల్ కు వచ్చిన వాళ్ళు ఉన్నారు,డయాబెటిక్ నార్మల్ కు వచ్చిన వాళ్ళు ఉన్నారు,PCOD, PCOS కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు, ఇర్రెగ్యులర్  పిరియడ్స్  నార్మల్ కి  వచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది మేడమ్ గారి Wellness Coach లో క్లైంట్స్ ఉన్నారు... వీళ్ళు అందరూ కేవలం అంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం వల్ల మాత్రమే ఈ రిజల్ట్స్ చూశారు..

 ఇంకా కొంత మందికి  సహాయ సహకారాలు  అందాలనే ఉద్దేశంతో NETI STHREE Facebook Community Start చేశారు..అందులో కూడా 3K Member's దాకా ఉన్నారు..

నేటి స్త్రీ కమ్యూనిటీలో  ఎప్పుడు కూడా ఛాలెంజ్ లు  పెడుతూ ఆ  ఛాలెంజ్ లు కూడా అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతో ముందుకు  సాగుతున్నారు..ఇది దేవిగారి విజయాన్ని క్లుప్తంగా .

మేడమ్ గారి విజయాన్ని అందరికీ తెలియపరచినందుకు మన వాయిస్ కి ధన్యవాదాలు తెలుపుకున్నారు...
 
స్త్రీ మూర్తి అనుకుంటే ఎలాంటి పరిస్థితులు ఐనా రాని అడుగు మాత్రం విజయం వైపే అనడానికి నిలువెత్తు నిదర్శనం దేవిరెడ్డి గారు....

మనలో ఎదైన ఒకటి సాధించాలి అనే పట్టుదల ఉన్నప్పుడు మన ఉనికిని మనమే చాటుకోవాలి,మనం ఏమి చేయగలమే దాని కోసం  ఎప్పుడూ కష్టపడాలి ఇష్టపడి నేర్చుకోవాలి,మనకు ఒక సమయం వస్తుంది,ఆ సరైన సమయం వచ్చేదాకా మనం మనల్ని మనం తయారు చేసుకోవాలి,అలాంటి ఒక అవకాశం వచ్చినప్పుడు,ఆ అవకాశాన్ని సరైన మార్గంలోకి వెళ్ళే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి,అలా మీరు సిద్దం చేసుకున్న రోజున మీకు అవకాశం అనేది వస్తే చక్కగా సరైన మార్గం కి తీసుకెళ్ళి విజయాన్ని అందుకోండి..

ఎంతో మంది ఆదర్శప్రాయులను మీ,మన ముందుకి తీసుకొచ్చే మన వాయిస్ ఎప్పుడూ ముందు ఉంటుంది...


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens