The Jana Sena hopes to show its strength in the upcoming elections in Andhra Pradesh. It is taking steps in that direction. Responding to people's problems .. standing by the people .. fighting the government on behalf of the people. On the one hand, Jana Sena leaders and activists are going into the public sphere and understanding the problems of the people and are continuing the programs in the name of Janavani - Jana Sena Bharosa. On the other hand, Janasena chief Pawan Kalyan focused on strengthening the party.
The third batch of membership registration program will be taken up soon. This program will be held from 10th of this month to 28th of February. This program has been ambitiously brought to provide relief to the families of soldiers and to help those injured in accidents.
Addressing the Janasena party membership registration program, Janasena chief Pawan Kalyan called on the party workers to make the third phase of Janasena Kriya Seelaka membership registration process a success.
Shankham Jana Sena party filled the Jana Sena to make the dreams of the youth come true so that even the common people can do politics with the help of ideologies for the prosperity of tomorrow's generations. Those who take the membership should pay a nominal fee of Rs. If you pay 500, you can stay slow for a year. In case of accidental death, an insurance of Rs 5 lakh is provided to the family members and in case of any accident Rs. 50,000 along with accident insurance and health insurance with the flexibility to receive medical services anywhere in the world. This program has been designed to provide 5 lakh insurance facility to the workers who work continuously for the party.
Telugu Version
ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలని భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల సమస్యలపై స్పందిస్తూ .. ప్రజలకు అండగా నిలబడుతూ.. ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడుతోంది. ఓ వైపు జనసేన నేతలు, కార్యకర్తలు ప్రజా క్షేత్రంలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జనవాణి – జనసేన భరోసా పేరుతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు పార్టీ బలోపేతం చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. మూడో విడత సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనుంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించనుంది. జనసైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా, ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆదుకునేందుకు ఈ కార్యక్రమంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది.
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడో విడత జనసేన క్రియా శీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రేపటి తరాల భవిష్యత్తు కాంక్షించి, సమ సమాజ శ్రేయస్సుకు బాటలు సిద్ధాంతాల సాయంతో సామాన్యులు సైతం రాజకీయం చేసేలా యువత కలలు సాకారం అయ్యేలా జనసేనాని పూరించిన శంఖం జనసేన పార్టీ. సభ్యత్వం తీసుకొనే వారు నామ మాత్రంగా కొద్దిపాటి రుసుమును వారి వ్యక్తిగత బాధ్యతగా భావించి రూ. 500 చెల్లిస్తే చాలు ఏడాది పాటు ధీమా గా ఉండొచ్చు. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయల భీమా కుటుంబ సభ్యులకు అందించి ఆదుకుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే రూ. 50,000 ప్రమాద భీమాతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా వైద్య సేవలు అందుకునే వెసులుబాటు తో పాటు ఆరోగ్య భీమా అందిస్తారు. నిరంతరం పార్టీ కొరకు శ్రమించే కార్యకర్తలకు 5 లక్షల భీమా సౌకర్యం అందించేలా ఈ కార్యక్రమం రూపొందించారు.