Sushant Sing Rajput suicide case Mystery

Actress Riya Chakravarty has started suffering again in the case of the death of film actor Sushant Singh Rajput. Bollywood star hero Sushant Singh's suicide case recently took another turn. A new perspective has come to light. The name of actress Riya Chakravarty, who has been facing many accusations in this case, has once again come to the fore. Recently, Narcotics Control Bureau officials have registered a draft charge against her. NCB officials registered cases against her under various sections.

Actor Sushant Singh's girlfriend Riya Chakravarty and his friends were addicted to drugs, NCB said. The NCB clarified these matters in the additional charge sheet submitted to the court in the case related to Sushant's death. The accused conspired from March to December 2020. NCB found that a large amount of narcotic was bought and used. It is mentioned in the additional chargesheet that the money in Sushant's account was used for transactions. Various sections of the NDPS Act have been imposed in this incident. NCB has included 35 accused in this case.

Telugu Version

సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముందు నుంచీ పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న నటి రియా చక్రవర్తి పేరు మరోసారి తెర మీదికి వచ్చింది. తాజాగా ఆమెపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు డ్రాఫ్ట్ ఛార్జ్‌ను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు సెక్షన్ల కింద ఎన్సీబీ అధికారులు ఆమెపై కేసులు నమోదు చేశారు.

నటుడు సుశాంత్ సింగ్ తన స్నేహితురాలు రియా చక్రవర్తి, అతని స్నేహితులు డ్రగ్స్‌కు బానిసయ్యారని ఎన్‌సిబి తెలిపింది. సుశాంత్ మృతికి సంబంధించిన కేసులో కోర్టుకు సమర్పించిన అదనపు చార్జ్ షీట్‌లో ఎన్‌సీబీ ఈ విషయాలను స్పష్టం చేసింది. నిందితులు 2020 మార్చి నుంచి డిసెంబర్ వరకు కుట్ర పన్నారు. పెద్ద మొత్తంలో మత్తు మందు కొని వాడినట్లు ఎన్‌సీబీ గుర్తించింది. సుశాంత్ ఖాతాలోని డబ్బును లావాదేవీలకు వినియోగించినట్లు అదనపు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎన్‌డిపిఎస్ చట్టంలోని వివిధ సెక్షన్లు విధించారు. ఈ కేసులో 35 మంది నిందితులుగా చేర్చింది ఎన్‌సీబీ.

నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఛార్జ్ షీట్ ప్రకారం, నిందితులు డ్రగ్స్ కొనుగోలు, ఉపయోగించడం కోసం ఒకరితో ఒకరు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ 2018 నుంచి డ్రగ్స్ వాడుతున్నాడని కోర్టులో దాఖలు చేసిన అదనపు చార్జ్ షీట్ లో పేర్కొంది. సుశాంత్ ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పితాని, ఇతర నిందితులు నటుడిని డ్రగ్స్‌కు అలవాటు చేశారని ఛార్జ్ షీట్ పేర్కొంది.

రియా చక్రవర్తి, సోదరుడు షోక్, సుశాంత్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు నటుడి కోసం డ్రగ్స్ కొన్నారని ఆరోపణలు వచ్చాయి. NCB ప్రకారం, 2018 నుండి, సుశాంత్ తన ఉద్యోగులతో సహా వివిధ వ్యక్తుల ద్వారా క్రమం తప్పకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. ఎన్‌బిసి ఛార్జ్ షీట్ ప్రకారం వారు “పూజా సామాగ్రి పేరుతో డ్రగ్స్ కొనుగోలు చేశారని ధృవీకరించింది. సుశాంత్‌కు డ్రగ్స్ కొనుగోలు చేసి ఇచ్చిన కేసులో రియా చక్రవర్తిపై ఎన్‌సీబీ కేసు నమోదు చేసింది. నేరం రుజువైతే, రియా చక్రవర్తికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడుతుంది. అయితే ఈ విషయాలను నటి ఖండించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens