ఇవాళ అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూర్చున్న సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రఘురామకృష్ణరాజు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతూ, రేపటి సమావేశాల్లో టీ విరామం సమయంలో ఫొటో షూట్ ఉంటుందని వెల్లడించారు.
ఈ ఫొటో సెషన్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరూ ఉంటేనే ఆ ఫొటోకు నిండుదనం వస్తుందని అన్నారు.
"రేపటి ఫొటో షూట్ కు మీరు తప్పనిసరిగా ఉండాలి సార్. మీరు ఇప్పుడు చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నారు... మీ అనారోగ్యం అంతా నయమైనట్టుంది... ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి... ఇదే హుషారుతో మీరు రేపు కంపల్సరీగా ఫొట్ షూట్ కు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని రఘురామ అన్నారు.