రైటర్ ప్రసన్న యడ్ల
చిన్న వయస్సులోనే పెన్ను పట్టుకుని.. నేడు కోట్స్, స్టోరీస్, కంటెంట్స్ రాసే వరకు వెళ్లిన ఆమె నిజ జీవితం ప్రతి యొక్కరికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కేవలం రాయడంలోనే కాకుండా ఆటలు, చదువులో కూడా ముందు ఉండేది. పల్లెటూరి నుంచి వెళ్లిన ప్రసన్న కుమారి యడ్ల.. రైటర్ ప్రసన్న వరకు ఎదిగి హైదరాబాద్లో తన ప్రతిభకి క్యాష్ ప్రైజ్ లు, మొమెంటోస్ అందుకుంది. అంతే కాకుండా ఈమె వర్క్ చేసిన అన్ని కంపెనీలలో ఈమెకంటూ సేపరేట్ మార్కును క్రియేట్ చేసుకుంది.
బాల్యం& విద్య : తన ఐదవ యేట నుంచే పుస్తకం,పెన్ను పట్టుకుని రాస్తుండేది. రైటింగ్ అంటే ఎంత ఇష్టమో ఆటలు కూడా ఆమెకు అంతే ఇష్టం. ఆటల్లో ఎన్నో ప్రైజ్ లను గెల్చుకుంది. 5 వ తరగతి నుంచి ఆమెకి తెలియకుండానే ఆమె మనసు రైటింగ్ వైపు మళ్లింది. 10 వ తరగతి నుంచి చిన్న చిన్న కోట్స్ రాస్తూ ఉండేది. ఇంటర్లో ఏదో సాధించాలని ఆశ, కానీ ఆమె చదువుకు విలువనిచ్చి రెండేళ్లు రైటింగ్ వైపు చూడను కూడా లేదు. కానీ ఇంటర్లో ఆమెకి తెలియకుండా తెలుగు సబ్జెక్టు మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేది. అలా ప్రసన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తెలుగు సబ్జెక్ట్ లో 100కి 95 మార్కులు తెచ్చుకుని వారి కాలేజీ ఫంక్షన్లో మెడల్ అందుకుంది. అలాగే సెకండ్ ఇయర్లో కూడా తెలుగు సబ్జెక్టులో 100కి 95 మార్కులు తెచ్చుకుని రెండో యేడు కూడా మెడల్ అందుకుంది. ఇక్కడే తెలుస్తుంది.. ఆమె కోరిక ఎంత బలంగా ఉందో.. ఇంజినీరింగ్ చదివేటప్పుడు మళ్లీ రైటింగ్ వైపు ధ్యాస మళ్లింది. అప్పుడు కూడా చదువు ముఖ్యమని అనుకుని తన ఆశను అలాగే ఉంచుకుని బీ.టెక్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ ఐపోయిన తర్వాత హైద్రాబాద్ కు వచ్చి మెకానికల్ డిజైనింగ్ కోర్స్ లో జాయిన్ అయింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ల మీద ఆధారపడకుండా జాబ్ చూసుకోవాలని మార్కెటింగ్ జాబ్లో జాయిన్ అయింది.
కానీ ఆమె ఇంట్రెస్ట్ మాత్రం రైటింగ్ వైపే ఉండేది.. ఇంట్లో వాళ్లు మొదట్లో రైటింగ్ ఎందుకు? చక్కగా నువ్వు చదువుకున్న దాని వైపే జాబ్ చూసుకో అని అంటుండే వాళ్లు. కానీ ఆమె కోరిక బలంగా ఉండడంతో మన వాయిస్ నుంచి అవకాశం వచ్చింది. అలా ఆమె రైటింగ్ కెరియర్ మొదలైంది. జాబ్ చేసుకుంటూ మన వాయిస్ వారికి కోట్స్ రాస్తూ ఉండేది. ఆ తర్వాత ట్రెల్ వారు The Great Indian Writing Festival 1.0 కాంపిటీషన్ కండక్ట్ చేసారు. ఆ కాంపిటీషన్లో చాలా మంది రైటర్స్ పాల్గొన్నారు. టాప్ 50 సెలెక్ట్ చేయగా, ఆ లిస్ట్ లో ప్రసన్న బెస్ట్ రైటర్ గా మొమెంటో, ప్రైజ్ అందుకున్నారు. ఆ ప్రైజ్ రావడంతో.. ఆమె పై ఆమెకి ఒక నమ్మకం వచ్చింది. ఇక అప్పుడు డిసైడ్ అయిపోయింది.. రైటింగ్ వైపు వెళ్లాలని. మధ్యలో అటు.. ఇటు.. అడుగులు వేసినా తన కోరిక బలంగా ఉండటంతో ఆ దేవుడు చివరికి ఆమెను రైటింగ్ లోనే స్థిరపడేలా చేసాడు. కానీ జీవితంలో చాలా తక్కువ మందికే ఇలాంటి అవకాశం వస్తుంది.. వారిలో ప్రసన్న కూడా ఒకరు. మన కోరిక బలంగా ఉంటే.. ఎలాగైనా అది నెరవేరుతుందని ప్రసన్న విషయంలో తెలుస్తుంది.
అవార్డ్స్:
1. 2017 లో బీబీ గ్రూప్ వారు నిర్వహించిన బిజినెస్ ప్రోగ్రాంలో Top 2 RM/ BDM మొమెంటో అందుకున్నారు.
2. 2019 lo ట్రెల్ వారు నిర్వహించిన The Great Indian Writing Festival 1.0 లో బెస్ట్ రైటర్ గా ప్రైజ్ అందుకున్నారు.
3. My gov quiz లో పాల్గొని 50 కి పైగా సర్టిఫికెట్స్ పొందారు.