BRS MLC Kavitha has been placed in suspense for attending the ED investigation . It has been decided that Kavitha will attend the ED investigation. It seems that discussions were held with the legal experts from the night regarding the attendance. After long discussions, it was decided to go to trial. Kavitha will go to the ED office at 11 am this morning. Other leaders including Minister KTR and Santhosh were present in the residence along with Kavitha.
A heavy police force has been deployed in front of KCR's residence and ED office in Delhi. The ED has already filed a caveat petition in the Supreme Court asking them not to issue prior orders without hearing the arguments. Ramachandrapillai's custody will end today. It seems that if Kavita attends the ED investigation, there is a chance to be interrogated along with Pillai.
Telugu version
ఈడీ విచారణకు హాజరుపై సస్పెన్స్‌కు తెరదించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈడీ విచారణకు కవిత హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. హాజరుపై రాత్రి నుంచి న్యాయనిపుణులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ చర్చల అనంతరం విచారణకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఉదయం 11 గం.లకు ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లనున్నారు. కవితతో పాటే నివాసంలో మంత్రి కేటీఆర్, సంతోష్ సహా ఇతర నేతలు ఉన్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం, ఈడీ ఆఫీస్ ఎదుట భారీగా పోలీసుల మోహరించారు.వాదనలు వినకుండా, ముందస్తు ఆదేశాలు జారీ చేయొద్దంటూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఈడీ కేవియట్ పిటీషన్ వేశారు. ఇవాళ్టితో ముగియనున్న రామచంద్రపిళ్లై కస్టడీ. కవిత ఈడీ విచారణకు హాజరైతే పిళ్లైతో కలిపి విచారించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.