Jagannanna Amma Odi Scheme Running Successfully

English Version

The Jagananna Amma Odi scheme implemented by the YCP government in AP has brought about major changes in the education sector. Admissions have increased tremendously through this scheme which was introduced under the slogan of education for all. There is no doubt that the programs undertaken by YS Jagan in the field of education stand as a compass for the country. 

For the 2021–22 academic year, 5,48,329 mothers were newly enrolled. This is an example of how the scheme can be sustainable and comprehensive. All of them are mothers of children who have joined the same class. It is a good development that they have fulfilled the 75% attendance requirement satisfactorily. A total of 43,96,402 mothers will get about Rs 6,595 crore to the Chief Minister's button. Thus 82,31,502 children are benefiting.

Amma Odi Amazing Results

As a result of the measures taken to send children into slavery, the number of admissions in public schools has increased by almost 7 lakh from 37.21 lakh by 2018-19. 44.30 lakhs by 2021–22. The number of admissions in public and private schools increased by 2 lakhs to 72.7 lakhs. On the other hand the money provided for children’s education during a disaster like Covid has done them a lot of good. There is no doubt that these schemes stand as a shield in times of disaster.

Telugu Version

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న అమ్మ ఒడి పథకం విద్యా రంగంలో పెను మార్పులు తీసుకొచ్చింది. అందరికీ విద్య అనే నినాదంతో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా అడ్మిషన్లు భారీగా పెరిగాయి.  విద్యా రంగంలో వైయస్ జగన్  చేపట్టిన కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. చదువుల మీద ఒక ముఖ్యమంత్రిగా ఆయన పెడుతున్న శ్రద్ధ స్వతంత్య్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా పెట్టలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్షణక్షణానికీ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఊహించని స్థాయికి చేరుతున్న విజ్ఞానాన్ని రేపటితరం పిల్లలు అందిపుచ్చుకోవాలన్న ఆయన సంకల్పం కొనసాగుతోంది. ఉన్నవారితో సమానంగా లేనివారి పిల్లలకూ అన్నీ అందాలన్న ఆయన దృఢనిశ్చయం కళ్లముందు కనిపిస్తోంది. పేద కుటుంబాల తలరాతలే కాదు, ఒక ప్రజాస్వామ్య దేశంగా, ఉత్తమ విలువలతో కూడిన సమాజంగా వర్థిల్లాలంటే అది కేవలం చదువుల ద్వారానే సాధ్యమనే బలంగా విశ్వసించిన ఆయన, విద్యారంగంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.

2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి 44,48,865 మంది తల్లులకు రూ.6,673 కోట్లను నెల్లూరులో 2021,జనవరి 11న సీఎం బటన్నొక్కి జమచేశారు. మొదటి ఏడాదిలో పథకం అప్పుడే ప్రారంభం అయిన దృష్ట్యా వారి పిల్లలను బడికి పంపేలా తల్లులను ఉత్సాహపరిచేలా ఎలాంటి హాజరు శాతాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ కూడా అమ్మ ఒడిని జమచేసింది. రెండో ఏడాది కూడా కోవిడ్  కారణంగా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు అందరికీ కూడా పిల్లల హాజరుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం వర్తింపచేసింది. ఈ ఏడాదిమాత్రం 75శాతం హాజరును పరిగణలోకి తీసుకుంది. పథకం ఉద్దేశం నీరు గారకుండా, లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించిన హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని పథకాన్ని వర్తింపు చేస్తామని నేరుగా ముఖ్యమంత్రే చిత్తూరు ‘అమ్మ ఒడి’ సభలో స్పష్టంచేశారు. మొత్తంగా మూడేళ్లకాలంలో కేవలం అమ్మ ఒడి పథకానికే రూ.19,617.53 కోట్లు వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది.

2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా అమ్మఒడి పరిధిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. పథకం స్థిరంగా, సమగ్రంగా కొనసాగుతుందనేందుకు ఇదొక ఉదాహరణ. వీరంతా కూడా ఒకటోతరగతిలో చేరిన పిల్లల తల్లులు. 75శాతం హాజరు నిబంధనను వీరు సంతృప్తికరంగా పూర్తిచేయడం మంచి పరిణామం. మొత్తంగా 43,96,402 మంది తల్లులకు సుమారు రూ.6,595 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి బటన్నొక్కి జమచేయనున్నారు. తద్వారా 82,31,502 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు.

అమ్మ ఒడి అద్భుత ఫలితాలు

పిల్లలను బడికి పంపేందుకు తీసుకున్న చర్యల కారణంగా 2018–19 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 37.21 లక్షలుగా ఉన్న అడ్మిషన్ల సంఖ్య దాదాపు రూ.7 లక్షలు పెరిగింది. 2021–22 నాటికి 44.30 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు పెరిగి, 72.7 లక్షలకు చేరుకుంది. మరోవైపు కోవిడ్ లాంటి విపత్తు సమయంలో పిల్లల చదువులకు అందిస్తున్న డబ్బు వారికి ఎంతగానో మేలు చేసింది. విపత్తు సమయంలో ఈ పథకాలు ఒక రక్షణ కవచంలా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens