తొలిసారి తన కమర్షియల్ జానర్‌ను మార్చి, టాలీవుడ్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం తరువాత జాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రంలో, బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. ఇది ఒక స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం.
ఇప్పటికే చిత్రబృందం చేసిన ప్రమోషన్లతో సినిమాపై మంచి హైప్ నెలకొంది. తాజాగా ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది. విడుదలైన మొదటి రోజు నుంచే సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.
ఫ్యామిలీ, లవ్ స్టోరీలకి పేరుగాంచిన భాస్కర్, ఈసారి కొత్త కోణంలో సినిమా తీయడానికి ప్రయత్నించారు. సిద్ధు జొన్నలగడ్డ యొక్క వన్ లైనర్స్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే వైష్ణవి చైతన్య తన అభినయంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది.
సాధారణంగా చూడగలిగిన పాయింట్లు ఉన్నా, ప్రేక్షకుల స్పందన మిశ్రమంగానే కొనసాగుతోంది.