Death of Jamuna is a huge loss for the film industry..

Telangana State Chief Minister K. Chandrasekhar Rao expressed his condolences to Jamuna. Her death is a loss for the film industry. CM KCR remembered Jamuna Jjapaka, who acted in hundreds of films as a first-generation actress and emerged as Telugu's favorite star.

With the death of Telugu beauty Satyabhama Jamuna, the film industry was cast in a sad shade. Film stars and fans are unable to digest the fact that Jamuna, who gave life to many diverse roles with her beauty and acting, is no more. Many celebrities from various fields are paying tributes to her who passed away at her home in Hyderabad. Deepest condolences to her family members. In this context, Telangana State Chief Minister K. Chandrasekhar Rao expressed his condolences to Jamuna. Her death is a loss for the film industry. CM KCR remembered Jamuna Jjapaka, who acted in hundreds of films as a first-generation actress and emerged as Telugu's favorite star. Jamuna, who has acted in Telugu, Tamil and Kannada films as well as in Hindi films and gained the audience's love, said that it is a great thing to do public service as a member of Parliament, not just as an actress. Jamuna on this occasionCM KCR expressed his deepest condolences to the family members.

Telugu  Version.


జమున పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

అలనాటి అందాల తార, తెలుగింటి సత్యభామ జమున మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన అందం, అభినయంతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసిన జమున ఇక లేరనే విషయాన్ని సినిమా తారలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూసిన ఆమెకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈనేపథ్యంలో జమున పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సిఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడం లోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్నిపొందిన జమున, నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens