Construction of Jagannath temple in London Indian businessman who donated Rs.250 crores

Sri Jagannath Society UK is a spiritual charity working to raise funds to build a temple in London. In this context, a businessman from Odisha has generously donated 250 crore rupees to help the endeavour. This is the first time that such a huge donation has been received for a temple being built abroad outside India. British-based billionaire Bishwanath Patnaik has donated Rs. He gave 250 crores. Patnaik came to Britain from Odisha. The London charity announced that this amount was given last Sunday on the occasion of Akshaya Tritiya.

Bishwanath founded an investment firm Fin Nest Company in Britain. He is currently acting as the chairman of the company. The locals have formed a society called Sri Jagannath Society UK to build a temple of Lord Jagannath in the suburbs of London. It is collecting donations from people across the country. The temple is planned to be built on 15 acres of land on the outskirts of London. The construction work of the temple is progressing at a fast pace with a collection of around 70 crore rupees so far. Construction of the first phase is expected to be completed by the end of 2024.

Telugu version

శ్రీ జగన్నాథ్ సొసైటీ UK లండన్‌లో ఆలయాన్ని నిర్మించేందుకు ఒక ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థ నిధులు సేకరించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ ప్రయత్నానికి సహాయం చేయడానికి ఉదారంగా 250 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. భారతదేశం వెలుపల విదేశాల్లో నిర్మిస్తున్న ఆలయానికి ఇంత భారీ మొత్తంలో విరాళం రావడం ఇదే తొలిసారి. బ్రిటన్ లో ఉంటున్న బిలియనీర్ బిశ్వనాథ్ పట్నాయక్, బ్రిటన్ లో మొట్టమొదటి జగన్నాథ ఆలయాన్ని నిర్మించడానికి నిధులను సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. 250 కోట్లు ఇచ్చాడు. పట్నాయక్ ఒడిశానుంచి బ్రిటన్ కు వచ్చారు. ఈ మొత్తాన్ని అక్షయ తృతీయ సందర్భంగా గత ఆదివారం అందజేసినట్టుగా లండన్ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది.

బ్రిటన్ లో బిశ్వనాథ్ పెట్టుబడుల సంస్థ ఫిన్ నెస్ట్ కంపెనీ స్థాపించారు. ప్రస్తుతం ఆయనే ఆ కంపెనీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దాదాపు లండన్ శివారులో జగన్నాథ్ స్వామి ఆలయం నిర్మించేందుకు అక్కడి స్థానికులు శ్రీ జగన్నాథ సొసైటీ యూకే అనే ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. లండన్ శివార్లలోని 15 ఎకరాల స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 కోట్ల రూపాయల వసూళ్లతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి దశ నిర్మాణం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens