CM KCR Launches T Hub 2.0 at Rayadurgam

English Version

The world's largest technology incubator "T-Hub" 2.0 has been unveiled. The state government has allocated Rs. It was built on an area of ​​3.62 lakh square feet at a cost of Rs 400 crore. More than two thousand startups can operate at the same time. Telangana Chief Minister KCR inaugurated the T-Hub Facility Center on Tuesday evening. On this occasion, all the T hub premises were visited by CM KCR. The offices set up on different floors got to know their details. In the corridor on the upper floor of T-hub, CM KCR inspected the areas surrounding Back Knowledge City. The CM also inspected the buildings constructed to house the IT hubs in the country and abroad. The officials explained the features of the facility center to the Chief Minister. 

Representatives of various start-ups and representatives of various companies set up the T-Hub as a hub for discussion. The CM inspected the meeting halls and workstations. CM KCR asked Minister KTR about all the issues related to the T-hub Innovation Center. They said the T hub was built exclusively in the shape of a sandwich with a sophisticated design at the intersection of the widest 5 roads. They told the chief minister that 100-foot to 120-foot roads have been constructed to go 5 lanes from the T hub. The minister told KTR CM that the entire venture on the first floor was earmarked for capitalists. The CM reunited and inspected the leading companies spread around the T-Hub building. Minister KTR explained that all the companies working in the fields of gaming, animation and 3D effects in movies are based in Hyderabad and serve all over the world.


On the occasion, CM KCR specially congratulated Minister KTR and the team of officials who worked tirelessly for the development of IT. CM KCR directed DGP Mahender Reddy to coordinate with T-HUB to further develop the command control room to curb cyber crime, with a view to further enhancing technology in the police department. The CM on the occasion advised the officials that T-HUB should focus on working with start-ups to ensure that the technology, which is increasing day by day, meets the needs and aspirations of the people.  The CM said that future plans should be drawn up to utilize the talent of the youth in rural areas as well. CM KCR said that the progress in the IT sector in Hyderabad would be further enhanced in the future and the authorities should focus on enhancing the infrastructure accordingly.The entire T-Hub campus has become bustling with IT giants and startups.

Telugu Version

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్  “టీ–హబ్ ” 2.0 ఆవిష్కృతమైంది. వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మించారు. ఒకే సమయంలో ఏకంగా రెండు వేలకుపైగా స్టార్టప్ లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుంది. ఈ ప్రాంగణం టీహబ్  ఫెసిలిటీ సెంటర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్  మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రాంగ ణమంతా సీఎం కేసీఆర్ కలియ తిరిగారు. వివిధ అంతస్తుల్లో  ఏర్పాటు చేసిన కార్యాలయాలను వాటి వివరాలు తెలుసుకున్నారు. టిహబ్ పై అంతస్తులో కారిడార్లో కలియ తిరిగి నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. దేశ విదేశాల్లోని ఐటి కేంద్రాలను తలదన్నేలా నిర్మితమైన భవనాలను సిఎం తిలకించారు.

ఫెసిలిటీ సెంటర్ ప్ర త్యేకత లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పలు అంకుర సంస్థల ప్రతినిధులు, పలు రకాల కంపెనీల ప్రతినిధులు టి హబ్ కేంద్రంగా చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన.. మీటింగ్ హాల్స్, వర్క్ స్టేషన్లను సిఎం పరిశీలించారు. టిహబ్ ఇన్నొవేషన్ సెంటర్ కు సంబంధించిన విషయాలన్నింటినీ అధికారులను మంత్రి కెటిఆర్ ను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. టి హబ్ ను అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో అత్యాధునిక డిజైన్ తో సాండ్విచ్  ఆకారంలో ప్రత్యేకంగా టీ హబ్ ను నిర్మించడం జరిగిందని వారు తెలిపారు. టీ హబ్  నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించామని వారు ముఖ్యమంత్రికి చెప్పారు. మొదటి అంతస్తులో మొత్తం వెంచర్ కాపిటలిస్టులకోసం కేటాయించామని మంత్రి కెటిఆర్ సిఎం కు తెలిపారు. టిహబ్ భవనం చుట్టూ విస్తరించి వున్న ప్రముఖ కంపెనీలను సిఎం కలియతిరుగుతూ పరిశీలించారు. గేమింగ్, యానిమేషన్, సినిమాల్లో త్రీడీ ఎఫెక్టుల వంటి రంగాల్లో కృష్టి చేస్తున్న సంస్థలన్నీ హైద్రాబాద్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తమ సేవలందిస్తున్నాయని మంత్రి కెటిఆర్ వివరించారు.

ఈ సందర్భంగా ఐటీ అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమించిన మంత్రి కేటీఆర్ తో పాటు, అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు శాఖలో సాంకేతికతను మరింతగా మెరుగుపరుచుకునే దిశగా, సైబర్ క్రైం ను అరికట్టేందుకు కమాండ్ కంట్రోల్ రూం ను మరింతగా అభివృద్ది చేసేందుకు టిహబ్ తో సమన్వయం చేసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డికి సిఎం కెసిఆర్ సూచించారు. రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికత, ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా., దైనందిన జీవితంలో సామాన్య ప్రజల జీవన విధానాలు గుణాత్మకంగా పురోగమించేందుకు అంకుర సంస్థలు కృషి చేసేందుకు టిహబ్ దృష్టి సారించాలని సిఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వున్న యువతలోని టాలెంట్ ను కూడా వినియోగించుకునే దిశగా భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవాలని సిఎం తెలిపారు. భవిష్యత్తులో హైద్రాబాద్ లో ఐటి రంగంలో పురోగతి మరింతగా పెరుగుతుందని, దానికనుగుణంగా మౌలిక వసతులను పెంచేందుకు అధికారులు దృష్టిసారించాలని సీఎం కేసీఆర్ అన్నారు.

టీ హబ్-2 ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టిహబ్ లో అంకుర సంస్థల ప్రతినిధులు దేశ, విదేశాలకు చెందిన ఐటి రంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. టిహబ్ నిర్మాణంలో పాలుపంచుకున్న పలువురితో పాటు టిహబ్ లో భాగస్వాములైన పలు అంకుర సంస్థల ప్రతినిధులను, సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించారు. టీహబ్ ప్రాంగణం మొత్తం ఐటీ దిగ్గజాలు, అంకుర సంస్థలతో సందడిగా మారింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens