The incidents of illegal movement of gold from abroad to India are increasing day by day. Now, customs officials have arrested two people who were transporting gold illegally at the Shamshabad Airport in Hyderabad. If we go into the details, two passengers coming from Dubai to India tried to move the gold wisely.
The customs officials noticed them suspiciously and checked their bags. However, 13 pieces of gold were found in the middle of the chocolates. Later, the accused were arrested.
Telugu version
విదేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని అక్రమంగా తరలించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే దుబాయ్ నుంచి ఇండియాకు వస్తున్న ఇద్దరు ప్రయాణికులు తెలివిగా బంగారాన్ని తరలించేందుకు యత్నించారు. అనుమానంతో వాళ్లని గమనించిన కస్టమ్స్ అధికారులు వాళ్ల బ్యాగులు తనిఖీ చేశారు. అయితే చాక్లెట్ల మధ్యలో 13 ముక్కలుగా అమర్చిన బంగారాన్ని గుర్తించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.