Nowadays various problems are bothering everyone due to changing lifestyle food habits. Dental problems are especially troublesome regardless of age. Especially eating sweets before going to bed and not brushing the teeth worsens the problems. Also everyone is troubled with many problems like bad breath and gum problems.
To protect against these, we do many things like brushing, flossing, tongue scraping for dental health. However, they fear that the problems will not go away. But experts suggest that such people will get better results if they do oil pulling. According to Ayurveda, oil pulling means gargling your teeth, mouth, and teeth. That means it helps remove bacteria from your mouth. Also promotes oral health and hygiene. Oil pulling helps get rid of bacteria that cause problems like tooth decay, bad breath, bleeding gums, etc. How to do oil pulling? Let's know its benefits in detail.
When should oil pulling be done?
During oil pulling the lipid structure of the oil surrounds these unicellular bacteria. At this point gargling the oil causes the bacteria to detach from the soft tissues and attach to the oil. Then when you spit out the oil it finally comes out. Ayurvedic experts recommend oil pulling before brushing your teeth and scraping your tongue. Oil pulling especially in the morning on an empty stomach has better benefits.
Telugu version
ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్ల కారణంగా వివిధ సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. ముఖ్యంగా దంత సమస్యలైతే వయస్సుతో సంబంధం లేకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పడుకునే ముందు తీపి పదార్థాలను తిని పళ్లను శుభ్రం చేసుకోకపోవడంతో సమస్యలు మరింత తీవ్రం అవుతున్నాయి. అలాగే నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు వంటి అనేక సమస్యలతో ప్రస్తుతం అందరూ ఇబ్బందిపడుతున్నారు. వీటి నుంచి రక్షణకు బ్రషింగ్, ఫ్లాసింగ్, టంగ్ స్కార్పింగ్ వంటి అనేక చర్యలు దంత ఆరోగ్యం కోసం చేస్తూ ఉంటాం. అయినా సమస్యలు మాత్రం వదలడం లేదని భయపడుతూ ఉంటారు.
అయితే ఇలాంటి వారు ఆయిల్ పుల్లింగ్ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ఆయిల్ పుల్లింగ్ అంటే మీ దంతాలు, నోరు, పుక్కిలించడం. అంటే మీ నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే నోటి ఆరోగ్యం, పరిశుభ్రతను ప్రోత్సహిస్తుంది. ఆయిల్ పుల్లింగ్ దంత క్షయం, నోటి దుర్వాసన, చిగుళ్ల రక్తస్రావం మొదలైన సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఆయిల్ పుల్లింగ్ ఎలా చేయాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆయిల్ పుల్లింగ్ ఎప్పుడు చేయాలి?
ఆయిల్ పుల్లింగ్ చేసినప్పుడు నూనెకు సంబంధించిన లిపిడ్ నిర్మాణం ఈ ఏకకణ బ్యాక్టీరియాను చుట్టుముడుతుంది. ఈ సమయంలో నూనెను పుక్కిలించడం వల్ల బాక్టీరియా మృదు కణజాలాల నుంచి వేరుపడి నూనెతో జత అవుతాయి. తర్వాత మీరు నూనెను ఉమ్మివేసినప్పుడు చివరకు బయటకు వెళ్లిపోతుంది. ఆయుర్వేద నిపుణులు ప్రకారం మీ దంతాలను బ్రష్ చేయడానికి, మీ నాలుకను స్క్రాప్ చేయడానికి ముందు ఆయిల్ పుల్లింగ్ చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.