కోపం
మనకు సహజంగా కోపం వస్తూనే ఉంటుంది. అలాంటి సమయంలో మన కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే మనం చెయ్యాలనుకున్నా పనిని చేయగలుగుతాము .
అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే చాలా కోల్పోవలిసి వస్తుంది.
కొన్ని సార్లు మనం తగ్గాలిసి వస్తే తగ్గడమే మంచిది. కోపం పెట్టుకొని అలాగే ఉంటే మనం ఏది కూడా సాధించలేము. జీవితంలో కోపం కూడా ఒక భాగమే...అలా అని మనం దాన్ని పట్టుకుని కూర్చోకూడదు. అందరూ ఒకలా ఆలోచించరు. మనం ఒకరికి చెప్పే ముందు మనది కూడా చూసుకొని వేరే వాళ్ళకి చెప్పాలి . అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం వేరే వాళ్ళకి చెప్తే మనలని పిచ్చి వాళ్ళ లాగా చూస్తారు. కాబట్టి , ఎవరికి చెప్పకండి .. ఇలా ఉండమని ..అలా ఉండమని . వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. వారి జీవితం అండి...మనమెవరమండి చెప్పడానికి . కుదిరితే కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిచండి.