A Story of Gurus Message

One day the Guru went to a nearby forest with his beloved disciple. Walking and walking, the teacher stopped at one place. He saw four plants nearby. One is a small plant just shedding its leaves, the second is a slightly larger plant, and the third is slightly larger than that. The fourth is a very large tree.

The Guru called his disciple and showed him the first plant and asked him to pull it. The boy easily plucked the plant. Now pointing to the second plant, Lageya demanded. The child also plucked the grain with some effort. The third one was also dragged. He used all his strength and pulled it with great difficulty.

 He pointed to a well-grown tree and asked him to try to pull it now. The boy tried to wrap both hands around the tree but could not move the tree. However, the teacher said to the boy who was trying, "Look girl! The same is true of our habits. Bad habits are hard to change once they become old. What is inflexible is it inflexible? This is how the saying originated. No matter how hard we try, those old habits will not leave us," said the teacher.

Gurusandesh Niti: Bad habits that have sprouted in us should be pulled when they are still a small plant.


Telugu version

ఒక రోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్ళాడు. నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు. దగ్గరలోనున్న నాలుగు మొక్కలను అతను చూశాడు. అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క, రెండవది కొంచం పెద్ద మొక్క, మూడవది దానికన్న కొంచం పెద్దది. నాల్గవది చాలా పెద్ద చెట్టు.

గురువుగారు తన శిష్యుడిని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నాడు. ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేసాడు. ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ లాగేయ మన్నాడు. ఆ పిల్లవాడు కొంత కష్టపడి ధానిని కూడా లాగేసాడు. మూడవదానిని కూడా లాగమన్నాడు. తన శక్తినంతా వుపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేసాడు.

 బాగా ఎదిగిన చెట్టును చూపిస్తూ ఇప్పుడు దీన్ని లాగడానికి ప్రయత్నించమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టుని కదిలించలేకపోయాడు. అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు “చూడు నాయినా! మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం. మొక్కై వంగనిది మనై వంగునా? అన్న సామెత ఈ విధంగానే పుట్టుకొచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు” అన్నాడు గురువుగారు.

గురుసందేశం నీతి: మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉనప్పుడే లాగేయాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens