జీవితం చెప్పిన గుణపాఠం
జీవితంలో ఏమి సాధించలేదని బాధ పడకండి. అసలు ముందు మీరు మీ గురించి ఆలోచించాలి కదా అండి మీరు ఏమైనా సాధించడానికి. ఎప్పుడు చూడు పక్కన వాళ్ళ గురించే.. మీ గురించి మీరు ఎప్పుడండి ఆలోచించేది. పక్కన వాళ్ళకి కుటుంభం ఉంది తిండి పెట్టడానికి . మరి మీకు ఏమి ఉందండి ? ఎప్పుడు కుటుంభం మీదే ఆధారపడదామా ? మనకంటూ గుర్తింపు వద్దా ? తెచ్చుకోవాలి కదా ? పెరు సంపాదించుకోవాలి కదా ? జీవితంలోనే ఏమి సాధించలేదు ? మళ్ళీ మధ్యలో ప్రేమలు ? ఎవరండి మిమ్మల్ని చూసి ప్రేమించేది ? ఇదిగో అన్న ? ఇదిగో అక్క ? మీ కోసమే చెప్తున్నా ...ముందు జీవితం గురించి ఆలోచిద్దాం. తరువాత వేరే వాటి గురించి పట్టించుకొని మరి ఆలోచిద్దాం.
మన జీవితంలో మనకి కావాలిసింది మనశ్శాంతి .అది కావాలంటే మనం అనుకున్నది సాధించాలి . మీ జీవితంలో మీకు మనశ్శాంతి కావాలంటే...ఒకరి దగ్గర నుంచి ప్రేమను ఆశించడం మానేయండి ?? ఎందుకంటే మనుషులను నమ్మే కన్నా దేవుడిని నమ్ముకోవడం వెయ్యి రెట్లు మంచిది . కాదంటారా ? అవుననే అనాలి .
మన జీవితాన్ని మనమే ప్రేమించుకోవాలి . ఈ విషయం తెలుసుకోండి. మన జీవితంలోకి పక్కన వారు అవసరం కోసమే వస్తారు ? అవసరం కోసం వచ్చినప్పుడు మీరు కూడా అలాగే అవసరం వచ్చినప్పుడు పలకరించండి. అప్పుడు వాళ్ళకి మీ బాధ విలువ తెలుస్తుంది.