Research scholars from IIT Madras have developed a paper-based 3D portable device. With the help of this technology adulteration in milk can be detected within 30 seconds. This technology device is very easy to use. Even a person sitting at home can easily discover the purity of milk. It is known that by preparing milk with urea, detergent, soap, starch, hydrogen peroxide etc. adulterated milk is sold in the market. In these situations adulteration in milk can be detected very easily with the help of this device.
This 3D device will be available in the market at a very cheap price. With its help.. adulteration can be easily detected in water, juice and other products. It is known that research is being done on adulteration of milk in the laboratory till now. It is very expensive and the process takes a lot of time. But now this device developed by students is available at a low price.
Telugu version
ఐఐటీ మద్రాస్‌కు చెందిన రీసెర్చ్ స్కాలర్లు పేపర్ ఆధారిత 3డీ పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ సహాయంతో పాలలో కల్తీని 30 సెకన్లలోపే గుర్తించవచ్చు. ఈ సాంకేతికత పరికరం ఉపయోగించడం చాలా సులభం. ఇంట్లో కూర్చున్న వ్యక్తి అయినా పాలలోని స్వచ్ఛతను సులభంగా కనుగొనవచ్చు. పాలను యూరియా, డిటర్జెంట్, సబ్బు, స్టార్చ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి వాటితో తయారు చేస్తూ.. కల్తీ పాలు తయారు చేసి మార్కెట్ లో అమ్మకం ఎక్కువైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పాలల్లో కల్తీని ఈ పరికరం సహాయంతో చాలా సులభంగా గుర్తించవచ్చు.
ఈ 3డి పరికరం చాలా చౌకైన ధరకు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకుని రానున్నారు. దీని సహాయంతో.. నీరు, రసం, ఇతర ఉత్పత్తులలో కల్తీని సులభంగా గుర్తించవచ్చు. ఇప్పటి వరకు ప్రయోగశాలలో పాలలో కల్తీపై పరిశోధన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది చాలా ఖరీదైనది అంతేకాదు ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ డవలప్ చేసిన ఈ పరికరం తక్కువ ధరకే లభ్యమవుతుంది.