ఎంపీల జీతాలు పెంపు – కేంద్రం కొత్త నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వం ఎంపీల జీతాలు, భత్యాలు, పింఛన్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుండి ఈ పెరిగిన వేతనాలు అమలులోకి వస్తాయని వెల్లడించింది.
ఎంపీలకు పెరిగిన వేతనాలు & భత్యాలు:
-
ఎంపీ జీతం: రూ.1,00,000 నుండి రూ.1,24,000కు పెంపు.
-
రోజువారీ భత్యం: రూ.2,000 నుండి రూ.2,500కు పెంపు.
-
మాజీ ఎంపీల పింఛన్: రూ.25,000 నుండి రూ.31,000కి పెంచారు.
-
అదనపు పింఛన్: ఐదేళ్ల సర్వీసు తర్వాత ప్రతి సంవత్సరానికి రూ.2,000 నుండి రూ.2,500కి పెంపు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఈ పెంపు ప్రకటన వెలువడటం గమనార్హం. గత సవరణ 2018లో జరిగింది, ఆ సమయంలో ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఎంపీల మూల వేతనాన్ని నిర్ణయించారు.
ఎంపీలకు అదనపు ప్రయోజనాలు:
-
₹70,000 నియోజకవర్గ భత్యం – కార్యాలయ నిర్వహణ & ఓటర్ల సంబంధాల కోసం.
-
₹60,000 కార్యాలయ నిర్వహణ భత్యం.
-
పార్లమెంటరీ సమావేశాల్లో రోజుకు ₹2,500 భత్యం.
-
34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు (కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది).
-
ఎప్పుడైనా ఫస్ట్-క్లాస్ రైలు ప్రయాణం ఉచితం.
-
రోడ్డు ప్రయాణాలకు మైలేజ్ అలవెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది.
-
ఉచితంగా 50,000 యూనిట్ల విద్యుత్, 4,000 కిలోల నీరు ప్రతి సంవత్సరం.
-
ఢిల్లీ లో ప్రభుత్వ హౌసింగ్ సదుపాయం (అద్దె లేని వసతి – హాస్టల్ గది, అపార్ట్‌మెంట్ లేదా బంగ్లా).
-
అధికారిక హౌసింగ్ ఉపయోగించకుంటే గృహ అద్దె భత్యం అందుబాటులో ఉంటుంది.