పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం – ఏపీ ప్రభుత్వం ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించింది. మార్చి 17 నుండి పరీక్షలు ప్రారంభంకానుండగా, రాష్ట్రవ్యాప్తంగా 6.49 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థుల ప్రయాణ సౌలభ్యం కోసం మొత్తం 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో, APSRTC విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సేవలు Palle Velugu, Ultra Palle Velugu, మరియు City Ordinary బస్సుల్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.