అందరూ వేచి చూసిన " ఆర్ ఆర్ ఆర్ " సినిమా విడుదల అయి ఒక పక్క రికార్డ్స్ బద్దలు కొడుతుంది..ఇంకో పక్క పాసిటివ్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్ లో జనాలను ఒక ఊపు ఉపేస్తుంది. "ఆర్ ఆర్ ఆర్ " సినిమాలో నటీనటులు ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, ఆలియాభట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, ఆలిసన్ డూడి, రే స్టీవెన్సన్, శ్రియా శరణ్ తదితరులు. ఈ సినిమా కథను కె.వి. విజయేంద్ర ప్రసాద్ రాసారు . మాటలు సాయిమాధవ్ బుర్రా అందించారు కెమెరా మెన్ సెంథిల్ కుమార్ పని చేసారు .ఈ సినిమాని డి.వి.వి. దానయ్య నిర్మించారు . దర్శకత్వం జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి వహించారు.
రామరాజు రామ్ చరణ్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక పోలీస్ అధికారిగా పని చేస్తుంటాడు. మరోవైపు భీమ్ జూనియర్ ఎన్టీఆర్ గోండు జాతి బిడ్డ. లాల జాతి నుంచి ఒక చిన్న పిల్లను బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకొని పోతారు . ఆ పాపను తీసుకురావడానికి వేషం మార్చుకుని భీమ్ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్తాడు. భీమ్ను పట్టుకోవడానికి రామరాజును నియమిస్తారు బ్రిటీష్ అధికారులు. ఇలా జరుగుతున్నప్పుడు ఇద్దరు ఒకరి గురించి ఒకరికి తెలియకుండా స్నేహితులు అయిపోతారు రామ్ భీమ్. భీమ్ అక్కడే చిక్కుకుపోతాడు. రామరాజు , భీమ్ను ఎలా కాపాడుకున్నాడు , భీమ్ కోసం రామ రాజు ఏమి చేశాడు అనేది తెలుసుకోవడానికి సినిమా చూడాలసిందే !
ఎన్ టీ ఆర్ పాత్రకు ప్రాణం పోసి , ఆ పాత్రకు చేయవాలిసిన న్యాయం కంటే ఎక్కువే చేశారు .
తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. రాం చరణ్ , రామ రాజుగా తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచాడు . ఇంక రాజమౌళి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉన్న చోట నుంచి సరి కొత్త ప్రపంచంలో తీసుకెళ్లగలిగే సత్తా ఉన్నా డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారు.
రేటింగ్ :- 4/ 5