Business

The good news is that the prices of Gold have reduced in Telugu states

Be it weddings, auspicious events, festivals... many people buy gold and silver. That is why gold and silver are always in demand all over the world. However, according to the developments taking place around the world, there are changes and additions in the prices of gold and silver in the bullion market.

 Sometimes the prices go up, sometimes they go down. Recently, the price of gold has gone down, but the prices of silver have gone up. According to domestic prices till Saturday morning, the price of 24 carat ten grams (Tulam) gold decreased by Rs.310 to Rs.60,440. 10 grams of 22 carat gold decreased by Rs.300 to Rs.55,400. However, the price of silver has increased by Rs.600 to Rs.79,000 per kg.

Gold prices in major cities

If the price of 10 grams of 22 carat gold in Delhi is Rs.55,550, the price of 24 carat gold is Rs.60,590. In Mumbai 22 carats 55,400, 24 carats 60,590, in Chennai 22 carats Rs 55,700, 24 carats Rs 60,760, in Bangalore 22 carats 55,400, 24 carats 60,440. Major cities in Telugu states.. In Hyderabad, Vijayawada, Visakhapatnam, 22 carats are Rs.55,400 and 24 carats are Rs.60,440.

Silver prices in major cities

The price of silver per kg in Delhi is Rs.79,000. It is Rs.79,000 in Mumbai, Rs.82,000 in Chennai and Rs.77,000 in Bangalore. In Hyderabad, Vijayawada and Visakhapatnam, the price of silver per kg is Rs.82,000.

Telugu version

పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు... ఇలా చాలా మంది బంగారం, వెండి కొంటారు. అందుకే బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను బట్టి బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.

  కొన్నిసార్లు ధరలు పెరుగుతాయి, కొన్నిసార్లు అవి తగ్గుతాయి. ఇటీవల బంగారం ధర తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. శనివారం ఉదయం వరకు దేశీయ ధరల ప్రకారం 24 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.310 తగ్గి రూ.60,440కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.300 తగ్గి రూ.55,400కి చేరింది. అయితే కిలో వెండి ధర రూ.600 పెరిగి రూ.79,000కి చేరుకుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లు 55,400, 24 క్యారెట్లు 60,590, చెన్నైలో 22 క్యారెట్లు రూ. 55,700, 24 క్యారెట్లు రూ. 60,760, బెంగళూరులో 22 క్యారెట్లు 55,400, 24 క్యారెట్లు 60,440. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు రూ.55,400, 24 క్యారెట్లు రూ.60,440.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.79,000. ముంబైలో రూ.79,000, చెన్నైలో రూ.82,000, బెంగళూరులో రూ.77,000గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.82,000గా ఉంది.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets