tics Telangana

Sarkar's key decision on welfare hostels.. If there are less than 50 students..

The Telangana government has taken a key decision on the management of welfare hostels. The government, which has already taken a decision in principle to increase the mess charges, is considering the issue of regularizing the hostels according to the number of students. The welfare department has directed the officials to review the number of students hostel wise and prepare a report on the possibilities of adjustment in the nearby hostels.

 A cabinet sub-committee meeting was held on the increase in diet charges in welfare hostels, gurukula educational institutes and residential educational institutes. Finance Minister Harish RaoMinisters Satyavathy Rathore, Gangula Kamalakar and others participated in this meeting which was chaired. A cabinet sub-committee has sent proposals suggesting to the government to increase the mess charges by 25 percent. It was also discussed that the hostels with less number of students should be merged with the nearby hostels to provide better facilities.

Telugu version

సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మెస్‌ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న సర్కారు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది.

 ఈమేరకు సంక్షేమ వసతిగృహాలు, గురుకుల వి ద్యా సంస్థలతో పాటు రెసిడెన్షియల్‌ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్‌ చార్జీల పెంపుపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు. మెస్‌ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదనలు పంపింది. అలాగే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మరిన్ని మెరుగైన వసతులు కల్పించే విషయంపైనా చర్చించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens