orts

ఐపీఎల్-2025: 10 జట్ల కెప్టెన్ల గ్రూప్ ఫొటోలు చూశారా...!

రెండు నెలల పాటు క్రికెట్ వినోదం అందించేందుకు ఐపీఎల్ 18వ సీజన్ వచ్చేస్తోంది. మరో రెండ్రోజుల్లో ఐపీఎల్-2025 టోర్నీకి తెరలేవనుంది. 10 జట్లు పాల్గొనే ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెప్పొచ్చు. మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్.... మే 25న జరిగే ఫైనల్ తో ముగియనుంది.

తాజాగా ఐపీఎల్ జట్ల కెప్టెన్లతో ఫొటో షూట్ నిర్వహించారు. శ్రేయాస్ అయ్యర్ (కోల్ కతా నైట్ రైడర్స్), రజత్ పటిదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్), పాట్ కమిన్స్ (సన్ రైజర్స్ హైదరాబాద్), అజింక్యా రహానే (పంజాబ్ కింగ్స్), శుభ్ మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్), హార్దిక్ పాండ్యా (ముంబయి ఇండియన్స్), రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్), రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్), అక్షర్ పటేల్ (లక్నో సూపర్ జెయింట్స్) ఈ ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఐపీఎల్-2025తో కలిసి ఫొటోలు పోజులిచ్చారు.

ఆసక్తికర అంశం ఏమిటంటే... సన్ రైజర్స్ హైదరాబాద్ కు తప్ప మిగతా జట్లన్నింటికీ భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉన్నారు. హైదరాబాద్ టీమ్ కు ఆసీస్ ఆటగాడు కమిన్స్ కెప్టెన్ గా ఉన్నాడు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens