Telangana Bonalu Festival 2022

English Version

Arrangements have been made for grand spiritual celebrations in the historic city. Golconda Fort is ready for Ashada Bona. All the work was completed under the supervision of the officers. Today the first bonam will be offered to Goddess Jagadambika of Golconda. Special police teams have been set up to prevent any untoward incidents during the festivities. Golconda bonas will be maintained under the supervision of CCTV cameras at the foot. Security was set up by GHMC, in coordination with the Architect Department. Security was beefed up with 2,000 police.

The metropolis of Hyderabad becomes a spiritual paradise when it comes to aspiration. Bona festivities will begin with a procession of bonas, chanting of Shivasattvas and acrobatics of the descendants. In Galligalli, bonas are offered to the mothers and plants are paid for. Ashadha Bonas will begin on Thursday at the Golconda Fort Ellamma Jagadambika Temple. The festivities begin on a special stage set up at the Langer House.

All facilities have been set up for the devotees coming to Golconda Fort for Bona. Under the auspices of the Water Board, a fresh water supply has been set up up to the Ammawari Temple. In the last two years, due to Corona, the number of devotees has decreased a little, but this year, the head priests are hoping that it will be a grand event.

Telugu Version

చారిత్రక నగరంలో ఆధ్యాత్మిక సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆషాడ బోనాల కోసం గోల్కొండ కోట(Golconda Fort) ముస్తాబైంది. అధికారుల పర్యవేక్షణలో పనులన్నీ పూర్తి అయ్యాయి. నేడు గోల్కొండ జగదాంబికా అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరాల పర్యవేక్షణలో గోల్కొండ బోనాలను నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ, ఆర్కిటెక్ డిపార్ట్ మెంట్ సమన్వయంతో భద్రతను ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ఆషాఢం రాగానే హైదరాబాద్ మహానగరం ఆధ్యాత్మిక వనంగా మారుతుంది. బోనాల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో బోనాలు ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. గల్లిగల్లిల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆషాఢ బోనాలు గోల్కొండ కోట ఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో గురువారం ప్రారంభం కానున్నాయి. లంగర్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి ఈ వేడుకలను ప్రారంభిస్తారు.

బోనాల కోసం గోల్కొండ కోటకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జలమండలి ఆధ్వర్యంలో అమ్మవారి టెంపుల్ వరకు మంచినీటి సరఫరా ఏర్పాటు చేశారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా భక్తుల తాకిడి కొంచెం తగ్గింది కానీ ఈ సంవత్సరం మాత్రం ఘనంగా జరగబోతుందని ప్రధాన అర్చకులు ఆశిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens