Nandamuri Tarakaratna Pedda Karma will be held today (March 2) at Filmnagar Cultural Centre, Hyderabad. Family members of Nandamuri and Nara, film and political celebrities attended the event in large numbers. TDP leader Nara Chandrababu Naidu, Nandamuri Balakrishna, Daggubati Venkateswara Rao, Purandeshwari, Vijayasai Reddy, Chevireddy Bhaskar Reddy, Jr. NTR, Kalyan Ram and others were present. Pushpanjali was offered at Tarakaratna's picture. Many celebrities from Tollywood also attended and paid tribute to Tarakaratna.
On this occasion Chandrababu consoled Tarakaratna's wife Alekhya. He also had a fun talk with his daughter for a while. It is known that Nandamuri Tarakaratna passed away on February 18 last month. He collapsed due to a heart attack during the Nara Lokesh Kuppam Padayatra and fought with death for about 23 days. Doctors from abroad could not save his life.With the death of Tarakaratna, Nandamuri's family as well as his fans and TDP ranks were deeply saddened.
Telugu version
నందమూరి తారకరత్న పెద్ద కర్మ ఇవాళ (మార్చి 2) హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నందమూరి, నారా కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు , పురందేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు హాజరయ్యారు. తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరై తారకరత్నకు నివాళి అర్పించారు
. ఈ సందర్భంగా చంద్రబాబు తారకరత్న సతీమణి అలేఖ్యను ఓదార్చారు. అలాగే కూతురుతో కాసేపు సరదాగా మాట్లాడారు. నందమూరి తారకరత్న గత నెల ఫిబ్రవరి 18న కన్నుమూసిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ కుప్పం పాదయాత్రలో గుండెపోటుతో కుప్ప కూలిన ఆయన సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు.
విదేశాల నుంచి వైద్యులను రప్పించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. చివరకు శివరాత్రి రోజున శివైక్యం చెందారు. తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీతో పాటు ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.