సమంత నటనలో నూతన ప్రయాణం
సమంత సినిమా షూటింగ్‌లతో పాటు రెగ్యులర్ ఈవెంట్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఇటీవలే సిటాడెల్ హన్నీ బన్నీ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సిరీస్ భారీ ప్రేక్షకాదరణను పొందింది. అలాగే, తన సొంత ప్రొడక్షన్‌లో ఓ కొత్త సినిమా కూడా ప్రారంభించారు.
బంధాలు, ఆరోగ్యం పై సందేశాత్మక వీడియో
తాజాగా, భార్యాభర్తల బంధంపై సమంత షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. "మీరు మీ భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉండవచ్చు. నిజమైన ప్రేమ అన్నింటిని సమతుల్యం చేయగలదు. కానీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే, మీ భాగస్వామి కోరుకున్న విధంగా కనిపించలేరు. మనం ఎదుటి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటాం, కానీ మన మనసు, శరీరం ఎలా ఉంది అనేది గుర్తించము. ఈ పరిస్థితిలో, చివరకు ఆ బంధాన్ని కోల్పోవాల్సిన అవసరం వస్తుంది" అనే సందేశంతో ఆమె ఈ వీడియోను షేర్ చేశారు.