రేణు దేశాయ్: పిల్లలను చెడు ప్రభావాల నుండి రక్షించండి
ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీ పిల్లలను మంచిగా పెంచాలనుకుంటే, ఇలాంటి ఇడియట్స్ నుండి దూరంగా ఉంచండి. వారిని అన్‌ఫాలో చేయండి" అంటూ రేణు దేశాయ్ అన్నారు. నేటి యువత బాధ్యతగా ఉండాలని, ఫ్రీడం ఆఫ్ స్పీచ్ పేరుతో వల్గారిటీని ప్రోత్సహించకూడదని ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రేణు దేశాయ్‌కు మద్దతు తెలిపారు. “రేణు చెప్పింది 100% సత్యం” అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.