Search operation is going on for the whereabouts of Sai Priya, who went missing at Visakhapatnam's RK Beach. Has Sai Priya gone yet? Did it go to another place from there? What happened between 6 and 7 pm yesterday? No one can understand how the wife who was next to the husband disappeared within a minute. According to Visakha Police, Srinivas and Sai Priya got married two years ago. Yesterday was the marriage day so they went to Visakha. Went to Simhachalam temple in the morning and went home in the afternoon. Had lunch there and went to the beach in the evening. Both of them spent time on the beach taking pictures. But while Srinivas was checking messages on his cell phone, Saipriya who was next to him disappeared. When his wife was not found, the husband was worried and wandered around the area. With no result, he complained to the police.
As a result, Marine Police along with Threetown Police conducted a search operation last night. With no result, they are searching again today. The police say that they are investigating from all angles. People are crying because the child is not seen. The father is expressing grief that his daughter did not come back home after going to the beach. There are many suspicions about the disappearance of Sai Priya which is causing concern.
Telugu Version
విశాఖపట్నం ఆర్కేబీచ్లో అదృశ్యం అయిన సాయి ప్రియ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంతకీ సాయి ప్రియ గల్లంతయ్యిందా? అక్కడినుంచి వేరే చోటికి వెళ్లిపోయిందా? నిన్న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అసలేం జరిగింది? భర్త పక్కనే ఉన్న భార్య నిమిషంలోనే ఎలా మాయమైందన్న విషయం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. విశాఖ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ – సాయి ప్రియలకు రెండేళ్ల క్రితం వివాహమైంది. నిన్న మ్యారేజ్ డే కావడంతో విశాఖ వెళ్లారు. ఉదయం సింహాచలం గుడికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వెళ్లారు. అక్కడ భోజనం చేసి సాయంత్రం బీచ్కి వెళ్లారు. ఇద్దరూ ఫోటోలు దిగుతూ సముద్రం ఒడ్డున కాలక్షేపం చేశారు. అయితే శ్రీనివాస్ సెల్ఫోన్లో మెసేజ్లు చూస్తుండగా పక్కనే ఉన్న సాయిప్రియ కనిపించుకుండాపోయింది. భార్య కనిపించకపోవడంతో కంగారుపడ్డ భర్త పరిసర ప్రాంతాల్లో గాలించాడు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో నిన్న రాత్రంతా త్రీటౌన్ పోలీసులతో పాటు మెరైన్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఫలితం లేకపోవడంతో ఇవాళ మళ్లీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నామంటున్నారు. బిడ్డ కనిపించకపోవడంతో కన్నవాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. బీచ్కి వెళ్లొస్తామని వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాలేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సాయి ప్రియ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.