India's first Tribal President Droupadi Murmu

The tribal child's victory on the first pedestal is expected. But it was the majority that caught everyone's attention. Although the opposition nominated Yashwant Sinha as a candidate, the members of different parties voted for the NDA candidate Draupadi Murmu. Draupadi Murmu was elected as the President by winning more than that with cross voting. What was the actual voting percentage? In which states is cross voting done? If we go into those matters... NDA candidate Draupadi Murmu won the presidential election with a huge majority over opposition candidate Yashwant Sinha. MPs and MLAs together have 4,809 votes. Out of this 2,824 people voted for Murmu and 1877 people voted for Yashwant Sinha. The total value of votes of MPs and MLAs is 10,72,377. In this, the value of votes received by Murmu is 6,76,803.. and the value of votes received by Yashwant Sinha is 3,80,177. While Draupadi Murmu got 64.04 percent of the total votes cast, Yashwant Sinha managed only 35.97 percent.

Hundred percent of votes in AP are Murmu

Meanwhile, some of the votes of the parties that declared their support for Sinha were also lost. 17 MPs and 102 MLAs from opposition parties voted for her. It seems that tribal representatives from Assam, Chhattisgarh, Jharkhand, Madhya Pradesh, Maharashtra and Gujarat have engaged in cross voting. And BJP, which is in power in many states, got as many votes as it got in its own states in Andhra Pradesh, which has no real representation. Here, one hundred percent of the public representatives voted for Murmuke. Only in the small states of Nagaland and Sikkim did the BJP get 100 percent votes. In Telangana, Kerala, Punjab and Delhi, both the major parties voted against Murmu and the NDA got the least number of votes in those states. With Murmun being nominated as the BJP's presidential candidate, the NDA was able to garner the support of BJD, YCP, AIADMK, TDP, BSP, JDS and Akali Dal, which were far from the UPA alliance.

Telugu Version

ప్రథమ పీఠంపై గిరిజన బిడ్డ విజయం ఊహించిందే. కానీ మెజార్టీ ఎంతన్నదే అందరి దృష్టిని ఆకర్షించింది. విపక్షాలు యశ్వంత్ సిన్హా ను అభ్యర్థిగా నిలబెట్టినా.. వేర్వేరు పార్టీల సభ్యులు మాత్రం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కే ఓట్లేశారు. క్రాస్ ఓటింగ్తో అంతకుమించి అనేలా విక్టరీ కొట్టి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ద్రౌపది ముర్ము. అసలు ఓటింగ్ పర్సంటేజీ ఎంత? ఏయే రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది? అన్న విషయాల్లోకి వెళితే.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి 4,809 ఓట్లు ఉన్నాయి. ఇందులో 2,824 మంది ముర్ముకు ఓటు వేయగా.. 1877 మంది యశ్వంత్ సిన్హాకు ఓటు వేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10,72,377. ఇందులో ముర్ముకు వచ్చిన ఓట్ల విలువ 6,76,803.. ఇక యశ్వంత్ సిన్హాకు వచ్చిన ఓట్ల విలువ 3,80,177గా ఉంది. మొత్తం పోలైన ఓట్ల విలువలో ద్రౌపది ముర్ము 64.04శాతం సాధించగా.. యశ్వంత్ సిన్హా కేవలం 35.97 శాతంతో సరిపెట్టుకున్నారు.

ఏపీలో వందశాతం ఓట్లు ముర్ముకే..

కాగా సిన్హాకు మద్దతు ప్రకటించిన పార్టీల ఓట్లు కొన్ని ముర్ముకు కూడా పడ్డాయి. ప్రతిపక్షపార్టీలకు చెందిన17 మంది ఎంపీలు, 102 మంది ఎమ్మెల్యేలు ఆమెకు ఓటేశారు. అసోం, ఛత్తీ్సగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి గిరిజన ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి సొంత రాష్ట్రాల్లో కూడా దక్కనన్ని ఓట్లు అసలు ప్రాతినిధ్యమే లేని ఆంధ్రప్రదేశ్లో దక్కాయి. ఇక్కడ వంద శాతం మంది ప్రజాప్రతినిధులు ముర్ముకే ఓటేశారు. చిన్న రాష్ట్రాలైన నాగాలాండ్, సిక్కింలలో మాత్రమే బీజేపీ వంద శాతం ఓట్లు దక్కించుకుంది. తెలంగాణ, కేరళ, పంజాబ్, ఢిల్లీల్లో ప్రధాన పార్టీలు రెండూ ముర్ముకు వ్యతిరేకంగా ఓట్లు వేయడంతో ఆ రాష్ట్రాల్లో ఎన్డీయేకు అతి తక్కువ ఓట్లు దక్కాయి. ముర్మును బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడంతో ఎన్డీయే యూపీఏ కూటములకు దూరంగా ఉన్న బీజేడీ, వైసీపీ, అన్నాడీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్, అకాలీదళ్ మద్దతును కూడగట్టగలిగింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens