Doctors warn that there is a possibility of getting diseases if you play by boating in rainwater

Currently, rains are pouring down in Telugu states. It is raining heavily not only in Telugu states but all over the country. But medical experts say that rainy season is the season when diseases prevail. They warn that even if you get wet in the rain or play in the rain water, you will be exposed to various diseases.

 But nowadays rains and floods have become common. Delhi is already experiencing intermittent floods due to heavy rains. But experts say that many health problems arise due to standing water on the roads during monsoons. It is warned that mosquitoes will multiply and cause malaria, cholera and other diseases. So let's know the problems caused by rain water.

Experts warn that there is danger in Delhi, the capital of the country, especially due to rain water. People are warned that malaria and cholera cases are likely to increase in the coming days due to high floods. Apart from this, it is stated that skin related problems are also bothering. So those who play in the water are cautioned to keep these issues in mind. It is especially advised to keep children away from water bodies.

 Especially the accumulated water causes skin rashes and skin diseases. But it is warned that if this water enters the body, the person may contract leptospirosis. Doctors say it is a fatal disease. He said there are chances of diarrhea problems due to water storage. Experts suggest that those who travel during the rainy season should be careful as there is a possibility of frequent accumulation of water, especially in tourist places. So it is advised to stay away from water bodies as much as possible.

Telugu version

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ వర్షాకాలం అంటే వ్యాధులు ప్రబలే కాలం అని వైద్య నిపుణులు అంటున్నారు. వానలో తడిసినా, వాన నీటిలో ఆడినా రకరకాల రోగాల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

  కానీ ప్రస్తుతం వర్షాలు, వరదలు సర్వసాధారణమైపోయాయి. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. కానీ వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, కలరా తదితర వ్యాధులు ప్రబలుతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వర్షపు నీటి వల్ల కలిగే ఇబ్బందులను తెలుసుకుందాం.

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వర్షపు నీటి వల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరదల కారణంగా రానున్న రోజుల్లో మలేరియా, కలరా కేసులు పెరిగే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు కూడా వేధిస్తున్నాయని పేర్కొన్నారు. కాబట్టి నీటిలో ఆడుకునే వారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను నీటి వనరులకు దూరంగా ఉంచాలని సూచించారు.

  ముఖ్యంగా పేరుకుపోయిన నీరు చర్మంపై దద్దుర్లు మరియు చర్మ వ్యాధులకు కారణమవుతుంది. కానీ ఈ నీరు శరీరంలోకి చేరితే లెప్టోస్పిరోసిస్ సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. నీటి నిల్వ వల్ల డయేరియా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో తరచూ నీరు చేరే అవకాశం ఉన్నందున వర్షాకాలంలో ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు నీటి వనరులకు దూరంగా ఉండాలని సూచించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens