Bhagwan Shri Anantha Vishnu Deva Prabhu Bumper Offers

English Version

Police focused on Anantha Vishnu Deva of Jai Maha Bharat Party. Land offers for membership.. Why the collection of Aadhaar cards? They are dragging their feet on the details. They are also thinking of registering a case. But since no one complained, they are taking legal advice on how to proceed. It seems that Sumoto will register a case and arrest him. Ananta Vishnu Deva opened a new shop in Hyderabad saying that he is God. What is the secret behind that Shetter Bagotham has become a suspense. He says that he will give 200 yards of land for ten rupees as a membership. Is this work? Is it actually possible? Without thinking about it, women queued up at his office in large numbers.

People still don't know that Jai Maha Bharat Party is one. How many assets does such a party have? Who are the sponsors behind the party president to buy plots and distribute them to the poor? Is this all a propaganda ploy by the party? Police are investigating if there is any other angle. On the other hand, the police also informed the EC. Bukkaram villagers responded to Ananta Vishnu who declared himself as God. They say that they work with the spirit of service from childhood. But he did not give an answer as to why he is doing it now. Jai Mahabharat activists are campaigning hard to join the party. 5 lakh memberships in 3 months is being taken as the target. But why they are asking for Aadhaar cards is not clear. Many women are giving xeroxes of Aadhaar card in the hope of getting a place. The police mainly focused on this.

Telugu Version

జై మహా భారత్‌ పార్టీ(Jai Maha Bharat Party) అనంత విష్ణు దేవ(Anantha Vishnu Deva)పై ఫోకస్ పెట్టారు పోలీసులు. మెంబర్‌ షిప్‌కి ల్యాండ్ ఆఫర్లు.. ఆ మాటున ఆధార్‌ కార్డ్‌ల సేకరణ ఎందుకు? ఏంటన్న వివరాలపై కూపీ లాగుతున్నారు. అలాగే కేసు నమోదు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఫిర్యాదులెవరూ చేయకపోవడంతో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు. ఫైనల్‌గా సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. నేనే దేవుడ్ని అంటూ హైదరాబాద్‌లో కొత్త దుకాణం తెరిచాడు అనంత విష్ణు దేవ. ఆ షెటర్ బాగోతం వెనుక సీక్రెట్ ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది. పదంటే పది రూపాయలకు సభ్యత్వం ఇచ్చి.. 200 గజాల స్థలం ఇస్తానంటున్నాడు. ఇది అయ్యే పనేనా? అసలు సాధ్యమవుతుందా? అన్నది ఆలోచించకుండా మహిళలు పెద్ద ఎత్తున అతని కార్యాలయానికి క్యూ కట్టారు.

జై మహా భారత్‌ పార్టీ అనేది ఒకటుందని ఇప్పటిదాకా జనాలకు తెలియదు. అలాంటి పార్టీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? స్థలాలు కొని పేదలకు పంచివ్వడానికి పార్టీ ప్రెసిడెంట్‌ వెనక ఉన్న స్పాన్సర్లు ఎవరు? ఇదంతా పార్టీ ప్రచార ఎత్తుగడా? ఇంకేదైనా కోణం ఉందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈసీకి కూడా పోలీసులు సమాచారమిచ్చారు. తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న అనంత విష్ణు దేవపై బుక్కారం గ్రామస్తులు స్పందించారు. చిన్నతనం నుంచే సేవా స్ఫూర్తితో పనిచేసే వారని వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎందుకిలా చేస్తున్నాడన్న దానిపై మాత్రం సమాధానం ఇవ్వలేదు. పార్టీలో చేరాలంటూ జై మహాభారత్‌ కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. 3 నెలల్లో 5 లక్షల సభ్యత్వాలు నమోదు టార్గెట్‌గా ముందుకెళ్తున్నారు. అయితే ఆధార్‌ కార్డ్‌లు ఎందుకు అడుగుతున్నారన్నది అంతుపట్టడం లేదు. చాలామంది మహిళలు స్థలం వస్తుందనే ఆశతో ఆధార్ కార్డ్‌ జిరాక్స్‌లు ఇస్తున్నారు. దీనిపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens