TDP leader Nara Lokesh's Yuvagalam padayatra is going on in Chittoor district of AP. In the Yuvagalam Padayatra, Nara Lokesh is moving forward knowing the public problems. The ongoing Nara Lokesh Yuva Galam Padayatra in Chittoor district has completed 139.8 kilometers so far.
Lokesh Padayatra continues in Chittoor on Tuesday 12th. Party workers will hold Lokesh meetings with leaders at TDP district party office in Kongareddypally from 8 am to 3 pm. A public meeting will be held there at 3 o'clock. The padayatra will start from the district TDP office at 4.30 pm. Lokesh will meet the locals at Kongareddypally junction at 5.15 pm. Lokesh will stay the night at Lower Masapalli at 7.30 pm.
Second day of Revanth..
Meanwhile, the leaders' padayatras are continuing in the joint Warangal district. TPCC President Revanth Reddy Hath Se Hath Jodo Yatra will begin on the second day in Mulugu constituency. Revanth Reddy will undertake the padayatra on the second day after performing special pujas at the Ramappa temple. The padayatra will continue from Palampet, Keshavapur Bandarupalli Meesuga to Mulugu district center. A corner meeting will be held in Mulugu at 6 pm.
YS Sharmila..
Similarly, YSRTP President YS Sharmila's Praja Sangrama Yatra is continuing in Dharmasagar Mandal. YS Sharmila is doing padayatra since morning.
Telugu version
టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీలోని చిత్తూరు జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగుతున్నారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ యువ గళం పాదయాత్ర.. ఇప్పటి దాకా 139.8 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది.
మంగళవారం 12వ రోజు చిత్తూరులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ఉదయం 8 నుంచి 3 గంటల వరకు కొంగారెడ్డిపల్లిలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు నేతలతో లోకేష్ సమావేశాలు నిర్వహించనున్నారు. 3 గంటలకు అక్కడే బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 4.30 గంటలకు జిల్లా టిడిపి కార్యాలయం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం 5.15 గంటలకు కొంగారెడ్డిపల్లి జంక్షన్ లో స్థానికులతో లోకేష్ భేటీ అవుతారు. రాత్రి 7.30 గంటలకు దిగువ మాసపల్లి వద్ద లోకేష్ నైట్ స్టే చేయనున్నారు.
రేవంత్ రెండో రోజు..
కాగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతల పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ములుగు నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో రోజు ప్రారంభంకానుంది. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించిన అనంతరం రెండోరోజు పాదయాత్రను రేవంత్ రెడ్డి చేపట్టనున్నారు. పాలంపేట, కేశవాపూర్ బండారుపల్లి మీసుగా ములుగు జిల్లా కేంద్రం వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 6గంటలకు ములుగులో కార్నర్ మీటింగ్ జరగనుంది.
వైఎస్ షర్మిలా..
అదే విధంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా సంగ్రామ యాత్ర ధర్మసాగర్ మండలంలో కొనసాగుతోంది. ఉదయం నుంచి YS షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.