Key turning point in question paper leakage case.. ED enters the field!

The TSPSC question paper leakage case which is creating a sensation across the state of Telangana will take another turn. It is reported that the Enforcement Directorate (ED) is going to enter the field to investigate this case. ED officials have already made arrangements to register a case on this today. A case was first registered in Begambazar police station regarding the leakage of question papers. 

After that it was transferred to CCS. Police have already arrested 15 accused in this case. On the other hand, candidates who have scored more than 100 marks in the Group-1 examination are also being investigated. Based on the FIR registered in this matter, the ED will register a case regarding the diversion of funds and conduct an investigation. Another case has been registered specifically on the data leakage exposed by the Cyberabad police.

Telugu version

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరగనుంది. ఈ కేసును విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. దీనిపై నేడు కేసునమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

 ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తొలుత బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత దాన్ని సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు గ్రూప్‌-1 పరీక్షలో 100 మార్కులకు పైగా సాధించిన అభ్యర్థులను సైతం విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుంది. సైబరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేసిన డేటా లీకేజీపైనా ప్రత్యేకంగా మరో కేసు నమోదు చేసింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens