Nari Shakti - Empowering Women

మనసు ఉంటే మార్గాలు ఉంటాయి అనడానికి ఒక ఆదర్శం శ్వేతగారు | Nari Shakti - Empowering Women | Mana Voice

మనసు ఉంటే మార్గాలు ఉంటాయి అనడానికి ఒక ఆదర్శం శ్వేతగారు
ఆమె పేరు శ్వేత వేలమూరి,పెళ్లి అయ్యాక శ్వేత సుసర్ల అయ్యారు,ఊరు గిద్దలూరు ప్రకాశం జిల్లాలో ఉంటుంది, నాన్నగారు డాక్టర్  అమ్మ Housewife, ఇద్దరు తమ్ముళ్లు.

10th వరకు తెలుగు మీడియం లో చదువుకున్నారు.కొద్దీ రోజులు రాజంపేట కడప జిల్లాలో చదివారు,ఇంటర్ లో ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం అందులోను BIPC. ఇంకేముంది అంత గందరగోళం,ఎలాగో గట్టేక్కేసారు. డిగ్రీ లో కూడా అన్ని అద్భుతమైన Subjects ఏ తీసుకున్నారు మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ & కెమిస్ట్రీ అన్ని Major Subjects ఏ.MSc లో  బయోకెమిస్ట్రీ తీసుకున్నారు,అలా పీజీ దాకా చదువు ప్రయాణం కొనసాగించారు.

ఉద్యోగం కోసం హైదరాబాద్ కి వచ్చారు,మొదట్లో  ఒక ఫార్మా కంపెనీ లో మెడిసిన్ కి ఇంగ్రేడింట్స్ ప్రిపేర్ చేసే దాంట్లో జాయిన్ అయ్యారు. శ్వేతగారి మొదటి జీతం 2000 రూపాయలు.

ఉద్యోగరీత్యా నల్లకుంట లో 113 బస్సు ఎక్కి బాలానగర్ లో ఉన్న ఆఫీస్ కి వెళ్లేవారు.ఆ బస్సు కూడా ఆఫీస్ దాకా వస్తుందా అంటే లేదు దగ్గర దగ్గర 1 1/2 km నడిచేవారు,2007 లో శ్వేత గారి మేనత్త కొడుకు తో  వివాహం జరిగింది, వారి పేరు శరత్ , ఇంకో చిన్న కంపెనీ లో Microbiologist గా  ఉద్యోగం మొదలు పెట్టారు.అలాగే IPM నారాయణగూడా లో Water Analyst గా training తీసుకుని Water Analyst గా చాలా హోటల్స్ వాటర్ Check చేసి Approve ఇచ్చిన Signatures ఉంటాయి ,అలా సాగుతున్న  జీవితంలో 2009 లో ఒక అబ్బాయి పుట్టాడు పేరు యశోవసంత్. ఇప్పుడు 9thclass చదువుతున్నాడు. మధ్యలో బోలెడు health issues. ఇక వేరే జాబ్స్ వద్దులే అని దగ్గరలో ఉన్న స్కూల్ లో టీచర్ గా Join అయ్యారు. UKG క్లాస్ టీచర్ తర్వాత మళ్ళీ ఆరోగ్య సమస్యలు,ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా Years ఇంట్లోనే ఉన్నారు. 

అలా 2016 లో ఇంకో అబ్బాయ్ పుట్టాడు.రెండో అబ్బాయి పేరు Krishay Ashtosh.ఇప్పుడు 2nd class చదువుతున్నాడు. రెండో అబ్బాయ్ పుట్టాక ఎందుకో  బిజినెస్ చెయ్యాలన్న ఆలోచన శ్వేతా గారికి వచ్చింది. అప్పట్లో Silkthread Jewellery చాలా క్రేజ్ లో వుంది,రెండో అబ్బాయ్  బారసాలకి వచ్చిన డబ్బే శ్వేతా గారి పెట్టుబడి. 

అలా మొదలైంది శ్వేతా గారి బిజినెస్ జర్నీ,ఏవో కొద్దో గొప్పో orders వస్తూ ఉండేవి,అలా కొన్ని రోజులకీ  విజయవాడకి వచ్చేసారు. 

2017 లో శ్వేతా గారికి  హైపర్ Thyroid వల్ల  Eye Disease వచ్చింది.డాక్టర్స్ grave's disease అన్నారు  Identify చెయ్యటం వల్ల  Vision కి Problem రాలేదన్నారు. అలా చాలా ఆరోగ్య సమస్యలతో ఉన్నపుడే కరోనా వచ్చింది. ఇంకేముంది అప్పుడు శ్వేతాగారికి ఉన్న కలలకి ప్రాణం పోశారు. ఒకటేముంది కళకి కాదేది అనర్హం అని అన్ని Arts నేర్చుకున్నారు. Paintings, Crochet Work,Chocolate,Soapmaking ఇలా Arts చాలా మంది గురువుల దగ్గర నేర్చుకున్నారు. Fabric Jewellery మేకింగ్ own గా నేర్చుకుని ఎదో చిన్న పాటి బిజినెస్ చేస్తున్నారు.

ఈ జర్నీ లో చాలా మంది హితులు స్నేహితులు అయ్యారు. శ్వేత గారిలో ఉన్న కళ ని గుర్తించి ప్రొస్సహించే వాళ్ళు ఉన్నారు. అన్నింటిలోకి బిజినెస్ లో  Fabric Jewellery చాక్లెట్ మేకింగ్ బాగా use అయ్యింది. చాక్లెట్ గురువే మంచి ఫ్రెండ్ అయ్యారు ఇప్పుడు. ఇలా చాలా మంది స్నేహితులను సంపాదించుకున్నారు.

Music అంటే చాలా ఇష్టం గా ఉండేవాళ్ళు. కళకి వయస్సు తో కూడా పనిలేదని నేనిప్పుడు సంగీతం కూడా నేర్చుకున్నారు. Last ఇయర్ December లో ఇచ్డమ్ వాళ్ళు కండక్ట్ చేసిన అయిగిరినందిని 10 WORLD Records లో కూడా Participate చేశారు.తనని తాను నిరూపణ చేసుకోవటానికి చాలా కృషి  చేశారు,మొన్న ఈమధ్యనే ఇంకో ఈవెంట్ లో Participate చేశారు,అందుకు గాను  WORLD WIDE BOOK OF RECORDS వారి నుండి ఒక Certificate & ఒక Medal వచ్చింది.

శ్వేతా గారిని చూసి చిన్నకొడుకు అమ్మ నువ్వు గ్రేట్ కదా నీకు చాలా Certificates వచ్చాయి మెడల్స్ వచ్చాయి నీకు చాలా Arts వచ్చు అని మెచ్చుకునేవాడు, ఇంతకంటే ఇంకేముంటుంది ఈ జీవితానికి అని భావించే వాళ్లు.

ఏ ఒక్కరి ప్రోత్సాహం లేకున్నా ఇది సాధించటం కష్టం. కాకి పిల్ల కాకి ముద్దు అని నేనేం పాడిన మా అమ్మ నాన్నలకి నచ్చేస్తుంది,అమ్మే గొప్పది అన్న దాంట్లో నేనేం చేసిన నా పిల్లలకి గొప్ప,డబ్బు సంపాదించటమే కాదు అందరి మన్ననలను పొందగల్గిన వారే గొప్పవారు అని శ్వేతా గారు దృఢంగా నమ్మేవారు.

3 మంత్స్ బ్యాక్ శ్వేతాగారికి  Thyroiductomy సర్జరీ జరిగింది, వన్ Month రెస్ట్ తీసుకున్న మళ్ళీ  Routine కి వచ్చేసారు. Orders వస్తాయా రావా అన్నది పక్కన పెడితే ఏదోకటి చేస్తూ తనని తాను  తీరిక లేకుండ ఉంచుకుంటారు.

శ్వేతగారి విజయాన్ని తెలియ పరిచినందుకు Mana Voice వారి Nari Shakthi కి  ఋణపడి ఉంటాను అని ధన్యవాదాలు తెలిపారు.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets