International

సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025: ఎలాంటి ఫీజు లేకుండా దక్షిణ కొరియాలో చదువు పొందే అవకాశం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025: దక్షిణ కొరియాలో ఎలాంటి ఫీజు లేకుండా చదువుకునే అవకాశంతో దరఖాస్తు చేసుకోండి

విదేశాలలో చదువు అనుకుంటున్న విద్యార్థులకు ఇది అద్భుతమైన అవకాశం! సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం (SMG) సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025కు భారతీయ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా మీరు దక్షిణ కొరియాలోని టాప్ యూనివర్సిటీలలో 100% ట్యూషన్ ఫీజు మినహాయింపు తో పీజీ కోర్సులు చదవవచ్చు.

సియోల్ టెక్ స్కాలర్‌షిప్ 2025:

ఈ స్కాలర్‌షిప్ ద్వారా భారతీయ విద్యార్థులు సియోల్, దక్షిణ కొరియాలోని ప్రముఖ యూనివర్సిటీలలో మాస్టర్స్ డిగ్రీ పొందవచ్చు. సైన్స్ మరియు ఇంజనీరింగ్ రంగంలో విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు గడువు తేదీ మార్చి 14, 2025.

అర్హతలు:

  • భారతదేశ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 1985 తర్వాత జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • NIRF ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ లో టాప్ 100 యూనివర్సిటీలలో సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారు.
  • కనీసం 80% మార్కులు లేదా టాప్ 20% CGPA.
  • కొరియన్ యూనివర్సిటీలు అందించే అన్ని కోర్సులు ఇంగ్లిష్ లోనే నిర్వహించబడతాయి.

సParticipating Universities:

  • సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
  • సియోల్ యూనివర్సిటీ
  • కొరియా యూనివర్సిటీ
  • సూంగ్సిల్ యూనివర్సిటీ
  • క్వాంక్వూన్ యూనివర్సిటీ
  • క్యుంగ్ హీ యూనివర్సిటీ
  • సూక్మియుంగ్ మహిళా యూనివర్సిటీ
  • సియోక్యోంగ్ యూనివర్సిటీ
  • సుంగ్క్యుంక్వాన్ యూనివర్సిటీ

ఇంటర్న్‌షిప్ బెనిఫిట్స్:

  • 100% ట్యూషన్ ఫీజు కవరేజ్ (50% SMG మరియు 50% యూనివర్సిటీ)
  • కొరియా కు ఒకసారి ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్
  • నెలకు సుమారు ₹60,000 వరకు స్కాలర్‌షిప్
  • ఆరోగ్య బీమా కవరేజ్
  • గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ పూర్తయిన తరువాత కొరియాలో ఉద్యోగం కల్పించేందుకు సహాయం

దరఖాస్తు విధానం:

మీరు దరఖాస్తు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు, దరఖాస్తును పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సియోల్‌లోని భారత రాయబార కార్యాలయానికి పంపాలి. దరఖాస్తు ప్రాసెసింగ్ సమయం సుమారు 2 వారాలు ఉంటుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు గడువు తేదీ (మార్చి 14, 2025)లోపు దరఖాస్తు చేసుకోవాలి.

స్కాలర్‌షిప్ దరఖాస్తు పంపాల్సిన చిరునామా: శ్రీమతి అనన్య అగర్వాల్
భారత రాయబార కార్యాలయం
సియోల్ 101, డోక్సోడాంగ్-రో
యోంగ్సాన్-గు, సియోల్
రిపబ్లిక్ ఆఫ్ కొరియా
పిన్ కోడ్: 04419


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens