Andhra Pradesh

పోసాని కృష్ణ మురళిని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు

హైదరాబాద్‌లో నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. రాయచోటి పోలీసులు రాయదుర్గం లోని మై హోమ్ భుజా అపార్ట్మెంట్స్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం, ఆయనను ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తున్నారు.

అన్నమయ్య జిల్లా లోని ఒబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ మురళి పై కేసు నమోదైంది. స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తూ, ఆయన సినీ పరిశ్రమపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ కేసు నేపథ్యంలో రాజంపేట కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఈ వారెంట్ ప్రకారం, పోలీసులు రాయదుర్గం కు చేరుకుని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం రాజంపేట కోర్టులో హాజరుపర్చనున్నట్లు సమాచారం.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens